Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి రావికమతం : సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా మండల కేంద్రంలో శ్రీ శివ పంచాయతన వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో వేకువజాము నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి పాలు పంచదార తో కూడిన మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా సాయంత్రం నుంచి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు ప్రధాన అర్చకులు రాచకొండ లక్ష్మీనారాయణ గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించారు.
Admin
Rapid TV