Thursday, 30 July 2026 07:37:44 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

కారు ప్రత్యేక అరలో రహస్యంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం చేసుకున్న పట్టణ పోలీసులు.... ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

Date : 13 May 2025 07:33 PM Views : 244

Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV, నర్సీపట్నం : ఇటీవల కాలంలో పోలీసులు గంజాయి రవాణా పై ఉక్కు పాదం మోపుతుండడంతో గంజాయి స్మగ్లర్లు కొత్త కొత్త రవాణా విధానాలు అవలంబిస్తున్నారు. మంగళవారం కారు వెనుక సీటు క్రింద ప్రత్యేకంగా తయారు చేసిన అరలో తరలిస్తున్న గంజాయిని పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం డి.ఎస్.పి పి శ్రీనివాసరావు మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో అందించిన వివరాల ప్రకారం గంజాయి రవాణా పై రాబడిన ఖచ్చితమైన సమాచారం పై పట్టణ ఎస్సై జి ఉమామహేశ్వరరావు పట్టణ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట వాహనాలు తనిఖీ చేపట్టారని, ఉదయం పదిగంటల సమయంలో చింతపల్లి వైపు నుండి వస్తున్న టి ఎన్ 69 బి బి 9074 నెంబరు గల ఇండికా కారులో వస్తున్న వ్యక్తులు పోలీసులను చూసి కొద్ది దూరంలో కారును ఆపి కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారని, అది గమనించిన ఎస్సై ఉమామహేశ్వరరావు, సిబ్బంది సహాయంతో వారిని పట్టుకొని, కారును తనిఖీ చేయగా కారు వెనుక సీటు క్రింద ప్రత్యేకంగా తయారుచేసిన ఒక అరలో దాచి ఉంచిన ఐదు ప్యాకెట్లలో ఉన్న 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ఇండికా కారు, మూడు మొబైల్ ఫోన్లు, రూ.8 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిని రిమాండ్ నిమిత్తం పంపిస్తున్నామని డి.ఎస్.పి తెలిపారు . జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఏఎస్ఐ సత్యనారాయణ, కానిస్టేబుల్ శ్రీనివాసరావు లకు డి.ఎస్.పి నగదు బహుమతులు అందజేశారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ జి గోవిందరావు, పట్టణ ఎస్సైలు జే రమేష్, జి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

PALLA GOVINDARAO

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :